Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ నే ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుమానం ఉన్న చోట తాను కొనసాగడం కష్టమని ఆయన అన్నారు. తన సోదరుడు గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను ఎన్నికల బరిలో నిలబడనని చెప్పారు. తన తమ్ముడికి పోటీగా తాను నిలబడనని అన్నారు. తన తమ్ముడిని తనపై పోటీకి నిలబడేలా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి కొనసాగితే రాజకీయాలకు గుడ్ బై చెపుతానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలను భరించలేనని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి