Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. వ్యవసాయ అధికారి నియామక పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు పేర్కొంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షను మే 7న, పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష మే 13న, ఇంటర్ సాంకేతిక విద్యాశాఖలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి 17న, ఇంటర్ కమిషనరేట్లో లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి 17న నిర్వహించనున్నట్లు చెప్పింది. అయితే, పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల నియామకానికి గత డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. దాంతో పాటు 247 లెక్చరర్ల పోస్టులకు, సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ 37, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ 91 పోస్టులు, ఇంటర్ కమిషనరేట్లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి గత నెలలో వేర్వేరుగా టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించింది.