Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సీఎం వెంట సీఎస్ జవహర్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎస్‌వో చిదానందరెడ్డి ఉన్నారు. ఇవాళ రాత్రికి 1- జన్‌పథ్ నివాసంలో సీఎం జగన్ బస చేస్తారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రానికి పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరుగుపయనం అయ్యే అవకాశం ఉంది.