Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో 2023 వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వస్తీవాచనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మంగళవారం మాఘ శుద్ధ మాసం నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మాఘ బహుళ పాడ్యమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఫిబ్రవరి 2న ఎదుర్కోలు, 3న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 4న విమాన రథోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనేందుకు వీలుగా కల్యాణ టికెట్టు రూ.600 నిర్ణయించినట్లు వెల్లడించారు.