Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు దడ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిపై సోదాలు జరుగుతాయో తెలియక బడాబాబులు వణికిపోతున్నారు. నేడు మరోసారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. వసుద ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వసుద ఫార్మాతో పాటు రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారు. 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.