Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్
పాకిస్థాన్‌లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. కాగా, ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్‌లను మాత్రమే అనుమతిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం కొంత భాగం కుప్పకూలిపోగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.