Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచంలో నేడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, భారత దేశ బడ్జెట్ గురించి తెలుసుకోవాలని మన దేశవాసులే కాకుండా, యావత్తు ప్రపంచం ఎదురు చూస్తోందని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, అయినప్పటికీ మన దేశ బడ్జెట్ సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్ని విధాలుగా కృషి చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. భారత దేశానికి పెద్ద పీట, ప్రజలకు పెద్ద పీట్ణ అనే భావాన్ని స్వీకరించి తాము ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను పార్లమెంటు ముందు ఉంచుతారని ఆశిస్తున్నానన్నారు.