Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధి కల్పనాశాఖ అధికారి, ఇద్దరు సిబ్బంది లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఉపాధి కల్పనాశాఖ అధికారి కిరణ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔట్ సోర్సింగ్ లేఖ ఇచ్చేందుకు కిరణ్ రూ. 2.25 లక్షలు డిమాండ్ చేశాడు. కిరణ్, మరో ఇద్దరు కలిసి కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.