Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో పెను ప్రమాదం తప్పింది. డెక్కన్ మాల్ కూల్చివేత సమయంలో ఒక్కసారిగా 6 ఫ్లోర్లు కుప్పకూలాయి. ముందుగానే చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల డెక్కన్ మాల్లో మంటలు అంటుకుని భవనం తగలబడింది. పెద్ద ఎత్తున అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు, నిపుణులు పరిశీలించి భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో టెండర్లు పిలిచి భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేస్తుండగానే ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు అమాంతంగా కిందకి పడిపోయాయి. అధికారులు ముందుగానే సమీప ఇళ్లల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించడంతో ఎలాంటి ముప్పు సంభవించలేదు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు వాపోతున్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న అధికారులు పరిశీలిస్తున్నారు.