Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంటులో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు నేడు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో 59,550కి చేరుకుంది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 17,662 వద్ద స్థిరపడింది. పీఎస్యూ, ఇన్ఫ్రా, టెలికాం సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.