Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ ఆర్ధిక రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలో వేగంగా దూసుకొస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే ప్లాట్‌ఫాంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోలో అధికారి ప్లాట్‌ఫాంపై లోకల్ ట్రైన్ కోసం వేచిచూస్తూ నిలబడటం కనిపించింది. ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా ప్రయాణీకులు చూస్తుండగానే ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాంపై నుంచి కిందకు దూకిన అధికారి ట్రాక్స్‌పై పడుకుండటం కనిపించింది. అతడి శరీరంపై నుంచి రైలు దూసుకెళ్లడంతో క్షణాల్లో విగతజీవిగా మారాడు. పనిలో ఒత్తిళ్ల కారణంగా ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడలేదని పశ్చిమ రైల్వేల పీఆర్ఓ పేర్కొన్నారు. విల్లేపార్లే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.