Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరెవా గ్రూప్‌నకు చెందిన జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడ్ని రిమాండ్‌కు తరలించింది. ఈయనపై ఇంతకు ముందు మోర్బీ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. వంతెన కుప్పకూలిపోయినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. సెషన్స్ కోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపు జరుగనున్నది. ఈలోపు ఆయన కోర్టులో లొంగిపోయారు. 2022 అక్టోబర్ 30న మోర్బీ వంతెన కూలిపోయిన ప్రమాదంలో 135 మంది మరణించారు. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్ పటేల్ కనిపించకుండా పోయారని, చార్జిషీట్లో 'పరారీ'గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు ఈ నెల 20 న మోర్బీ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే నెల 1 వ తేదీకి వాయిదా పడింది. బ్రిటీష్ కాలం నాటి వంతెన నిర్వహణ బాధ్యతను ఎలాంటి గత అనుభవం లేని ఒరెవా గ్రూప్‌నకు గుజరాత్ ప్రభుత్వం అప్పగించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. వంతెనపైకి వెళ్లే వ్యక్తుల సంఖ్యపై పరిమితి లేకపోవడం, టిక్కెట్ల విక్రయంపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో వంతెన నియంత్రణ కోల్పోయిందని వంతెన కుప్పకూలడానికి దారితీసిన అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం తమ ఛార్జిషీట్లో పేర్కొన్నది. అలాగే, నిపుణుల సంప్రదింపులు లేకుండానే మరమ్మతులు చేయడం వంటి లోపాల వల్ల కూలిందని తెలిపింది.