Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మిలిటరీ ఎడ్యుకేషన్, త్రివిధ దళాల్లో అధికారుల నియామక ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు, ఇంటర్లో సీట్ల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నేటి (జనవరి 31) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆరోతరగతిలో (80 సీట్లు), ఇంటర్లో(ఎంపీసీ- 80 సీట్లు) ప్రవేశాలకు అర్హులైన బాలురు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఫిబ్రవరి 26న ఉంటుంది. దరఖాస్తు చేసుకొనేందుకు https://www.tswreis.ac.in/ లింక్‌పై క్లిక్ చేయండి.