Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరీంనగర్: హుజురాబాద్ లో ఏదో చేస్తామని బీజేపీ కబుర్లు చెప్పిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈటల రాజేందర్ ను హుజురాబాద్‌కు పరిచయం చేసింది కేసీఆర్ అన్నారు. జమ్మికుంట బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... తండ్రిలాంటి కేసీఆర్‌ను పట్టుకొని ఈటల విమర్శిస్తున్నారని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎవరి పాలన దేశానికి అరిష్టమో ఈటలకు తెలియదా?, ప్రజల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోడీ చెప్పారు.. వేశారా?, ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా వచ్చిందా? బండి సంజయ్ మోడీని దేవుడు అన్నారు... మోడీ ఎవరికి దేవుడు?, రూ.400 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యికి పెంచినందకు మోడీ దేవుడా?, నిత్యావసర ధరలు పెంచినందుకు మోడీ దేవుడా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్ గడ్డమీద గులాబీ జెండా ఎగరాలన్నారు.