Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్యాణ్ రామ్ హీరోగా 'అమిగోస్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా' అనే వీడియో సాంగును రిలీజ్ చేశారు. గతంలో బాలకృష్ణ చేసిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా స్వరకల్పనలో బాలు - చిత్ర ఆలపించిన ఆ పాట, రొమాంటిక్ సాంగ్స్ లో ముందువరుసలో కనిపిస్తుంది. అలాంటి ఆ పాటను ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ - సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కల్యాణ్ రామ్ - ఆషిక రంగనాథ్ పై ఈ పాటను అందంగా చిత్రీకరించారు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.