Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షి చెప్పిన దానికి, ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన దానికి పొంతన లేదని పాటియాలా కోర్టు చెప్పింది. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వొద్దని అతను చేసిన పని వల్ల అంతర్జాతీయంగా భారత్ అపఖ్యాతి పాలైందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అది వేరే విషయమని చట్టపరమైన విషయాలు మాత్రమే పరిశీలించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.