Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని మథుర భారీ అగ్నిప్రమాదం జరిగింది. మథురలోని మూడంతస్థుల బట్టల షోరూమ్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వస్త్రాల షోరూమ్ కావడంతో మంటలు వేగంగా బిల్డింగ్ మొత్తాని వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. మొదటి అంతస్థులో మంటలు అంటుకున్నాయని, అవి క్రమంగా రెండు, మూడో అంతస్థుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరుగలేదన్నారు. కాగా, మూడంతస్థుల బిల్డింగ్ పూర్తిగా కాలిపోయిందని షోరూమ్ సమీపంలో ఉన్న హోటల్ యజమాని శ్యామ్ సింఘాల్ చెప్పారు. షోరూమ్‌లోని సరుకంతా అగ్నికి ఆహుతయిందని వెల్లడించారు. కోట్లలో నష్టం వాటిళ్లిందని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.