Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. ఈ తరుణంలో హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం రాత్రి నుంచి నిరాటంకంగా మంచు పడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో హిమం గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
మంచుధాటికి జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇతు క్రమంలో రాంబన్ జిల్లాలోని రాంపడి-బనిహల్ మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు.