Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ 2023ను ప్రవేశపెట్టారు. అయిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో మంత్రిగా ఆమె రికార్డు సోంతం చేసుకున్నారు. వరుసగా అయిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను అయిదుసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల్లో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం ఉన్నారు.
2019 నుంచి నిర్మల వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్‌లు అయిదుసార్లు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టిన వారి జాబితాలో ఉన్నారు. 2014లో నిర్మల తొలిసారి మోడీ క్యాబినెట్లో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జైట్లీ 2014 నుంచి 2018 వరకు జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.