Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- న్యూఢిల్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ తరుణంలో బడ్జెట్లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు రెట్ల వరకు ఈ రైల్వే బడ్జెట్ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టడానికి ముందు యూపీఏ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ వ్యయం చేయబోతున్నట్లు నిర్మల తెలిపారు. ఈ క్రమంలోనే 2013-14 బడ్జెట్లో రైల్వేలకు కేటాయించినదాని కన్నా తొమ్మిది రెట్లు, అంటే రూ.2.4 లక్షల కోట్లు 2023-24 బడ్జెట్లో కేటాయించినట్లు, రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం రూ.75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహార ధాన్యాల గోదాములు వంటివాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు.