Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి ఈ సారి బడ్జెట్లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో 'కొత్త ఆదాయ పన్ను విధానం' డీఫాల్ట్ ఆప్షన్‌గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి..
కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు.
కొత్త ఆదాయ పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. వాటిని తాజాగా 5కు కుదించారు.
రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు.
రూ.3-6 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు.
రూ.6-9 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.
రూ.9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాలి.
కొత్త విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు.