Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కూకట్పల్లి స్టేషన్ పరిధిలో మంగళవారం వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావు నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకట్రావు నగర్లో నివాసం ఉంటున్న భర్త సోమిరెడ్డి (65), భార్య మంజుల( 58) మంగళవారం సూసైడ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు మియపూర్లో నివసిస్తుండగా చిన్న కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు.
ఈ తరుణంలో గాజులరామారంలో ఉంటున్న మంజుల సోదరుడు వెంకటరెడ్డి మంగళవారం ఉదయం సోమిరెడ్డికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సోమిరెడ్డి ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వెంకటరెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళి చూడగా దంపతులిద్దరూ చనిపోయి వున్నారు. దీంతో వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనారోగ్యంతోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.