Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఢీల్లి
కేంద్ర బడ్జెట్‌ను కొద్ది సేపటి క్రితం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్యం బాగోలేదని చివరి రెండు పేజీలు చదవకుండానే ప్రసంగాన్ని ముగించిన నిర్మలమ్మపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో పలువురు నాయకులు ట్విట్టర్ వేదికగా కామెంట్లు పోస్ట్ చేశారు.
దేశంలో మునుపటిలాగా.. గత 9 సంవత్సరాలలో కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. బడ్జెట్లో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశల వర్షం కురిపించారు. అయితే భారతదేశంలోని చమధ్యతరగతి వర్గం వారు ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టినప్పుడు అవన్నీ అనవసరంగా మారాయి. నిరుద్యోగం మొదలైన కారణాల వల్ల దిగువ మధ్యతరగతి చాలా విచారంగా మారింది’ అని మాయావతి ట్వీట్ చేశారు.
యూపీలోని మెయిన్‌పురికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా బడ్జెట్‌పై స్పందించారు. ఈ బడ్జెట్‌ను ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినట్లుగానే కనిపిస్తున్నది. మధ్యతరగతి వారికి కొంత సడలింపు ఇచ్చినప్పటికీ రైతులకు, ఉపాధికి, యువతకు ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఈ బడ్జెట్లో రైల్వేలను కూడా విస్మరించారు. ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని డింపుల్ యాదవ్ కామెంట్ రాశారు.