Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ఏడాది హోంశాఖకు కేంద్ర బడ్జెట్లో 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఈ తరుణంలో సీఆర్పీఎఫ్ లాంటి కేంద్ర బలగాలపైనే ఎక్కువ శాతం నిధుల్ని ఖర్చు చేయనున్నారు. 2023-24లో హోంశాఖకు 1,96,034.94 కోట్లు కేటాయించగా, 2022-23 బడ్జెట్లో 1,85,776.55 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట మౌళికసదుపాయాల కల్పన, పోలీస్ దళాల ఆధునీకరణ కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించారు. కేంద్ర హోంశాఖలో 1,27,756.74 కోట్లు కేవలం సీఆర్పీఎఫ్కు కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 1,19,070.36 కోట్లుగా ఉంది. సీబీఐకి 946 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే 4.4 శాతం కేటాయింపులు పెంచారు. 5 లక్షల మ్యాచురిటీ ఉన్న జీవితా బీమా అమౌంట్‌పై పన్ను వేయనున్నట్లు తెలిపారు.