Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ లాభపడగా... నిఫ్టీ నష్టాలను మూటకట్టుకుంది. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ముగింపు సమయంలో కిందకు జారుకుని ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లింది. కేంద్ర బడ్జెట్ పై ఆశలతో ఉదయం నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. అయితే చివరలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 59,708కి పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 17,616కి పడిపోయింది.