Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్2023పై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు, ఉపాధి హామీ కూలీలకు కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసే బడ్జెట్ అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ సర్కారు ప్రకటించిన ఈ బడ్జెట్ ఉద్యోగులకు ఊరట ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. కార్పొరేట్ల బడ్జెట్..రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసే బడ్జెట్ అని, విద్య, వైద్య రంగాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.