Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక్క మార్పు చేసింది. యుజ్వేంద్ర చహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. జాకబ్ డప్ఫీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్ జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.