Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని కరైకల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది గురువారం తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతోపాటు పుదుచ్చేరి, కరైకల్, ఉత్తర తమిళనాడులోని ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.