Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు అయిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌ను నేడు రిలీజ్ చేశారు. రెండేళ్ల తర్వాత అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. రెండు కేసుల్లో బెయిల్ వచ్చి నెల రోజులు అవుతున్నా.. లక్నోలోని స్పెషల్ కోర్టు కప్పన్‌ను రిలీజ్ చేస్తూ ఆదేశాలపై సంతకం చేసింది. రాక్షస చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు జైలు రిలీజైన తర్వాత కప్పన్ తెలిపాడు. బెయిల్ వచ్చినా జైల్లో పెట్టారని, రెండేళ్లు కఠినంగా సాగినా, ఎప్పుడూ భయపడలేదని కప్పన్ చెప్పాడు. కప్పన్‌ను 2020 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. హత్రాస్‌లో జరిగిన రేప్ ఘటనను రిపోర్ట్ చేసేందుకు వెళ్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. అతనిపై దేశద్రోహం కేసు బుక్ చేశారు. 2022 ఫిబ్రవరిలో అతనిపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
టెర్రర్ కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో అతని బెయిల్ వచ్చింది. ఇక డిసెంబర్లో అతనిపై మనీల్యాండరింగ్ కేసు బుక్కైంది. కానీ అనేక కారణాల వల్ల అతని రిలీజ్‌ను నిలిపివేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని కప్పన్ తెలిపాడు. కేవలం జర్నలిస్టుగా వార్తలను కవర్ చేసేందుకు హత్రాస్‌కు వెళ్లినట్లు అతను చెప్పాడు.