Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని పలు గోదాంలలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో గోదాంలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న వేలాది గోదాంలను ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో గోదాం యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల తరువాత నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెంట్రల్ జోన్లో గోదాం యజమానులకు నోటీసులు ఇస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కు ఇక నుంచి పోలీస్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.