Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని జీడిమెట్ల పరిధిలోని చింతల్లో భారీ చోరీ జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట్లో నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్లోని శివానగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మనోహర్ ఇటీవల దుండిగల్ సమీపంలోని బహదూర్పల్లిలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. మంగళవారం గృహప్రవేశం కోసం అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులతో రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం ఇంటికి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని సామాన్లు చెల్లాచెదురుగా పడేసి అందులో రూ.7లక్షల నగదు, 10 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. దొంగతనం జరిగిందని నిర్ధారించుకున్న మనోహర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.