Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీరాముడి గుడి సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు. వాటితో ఆలయ నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా రాముడి విగ్రహాన్ని తయారు చేయడం కోసం నేపాల్ నుంచి అరుదైన శాలిగ్రామ్ శిలాఖండాలను తెప్పించారు. కాళీ గందకీ నది నుంచి సేకరించిన 30 టన్నుల బరువున్న శిలల్ని ట్రక్కుల్లో నేపాల్ లోని జనక్ పూర్ నుంచి అయోధ్యకు గురువారం తీసుకొచ్చారు. వాటికి పూజారులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. శిలల్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రెండు భారీ శిలల్లో ఒకటి 18 టన్నులు, మరొకటి 12 టన్నుల బరువు ఉన్నాయని నేపాల్ అధికారులు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో వాటికి సాంకేతికంగా, శాస్త్రీయంగా అనుమతి వచ్చినట్లు తెలిపారు. శాలిగ్రామ్ శిలలను తరలించే విషయంలో నేపాల్ మాజీ ఉప ప్రధాని బిమలేంద్ర సహకారం అందించారు. సీతమ్మ వారి జన్మస్థలంగా భావించే జనక్ పూర్ లోనే బిమలేంద్ర పుట్టారు.