Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా మిశ్రమంగానే ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు దాదాపు చివరి గంటన్నర ముందు వరకు అదే బాటలో పయనించాయి. ఆఖర్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. కానీ, ముగింపునకు ముందు నిఫ్టీలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 59,459.87 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,007.67- 59,215.62 మధ్య కదలాడింది. చివరకు 224.16 పాయింట్ల లాభంతో 59,933.84 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,517.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,653.90- 17,445.95 మధ్య ట్రేడయ్యింది. చివరకు 5.90 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,612.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.17 వద్ద నిలిచింది.