Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. కేసీఆర్ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తమతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలన్నారు. రాష్ట్రంలో సమస్యలే లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి రాజకీయాలు మానేస్తానని చెప్పారు. ఈ మేరకు కేసీఆర్కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే.. ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు.