Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిస్తే చేతనైనంత సాయం చేసి తన మంచి మనసును చాటుకుంటారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలువురికి చేయూతనందించిన ఆయన తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్‌కు రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. 1980-90ల్లో ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల కోసం కెమెరామెన్‌గా పనిచేసి, దక్షిణాదిలో మంచి పేరు సొంతం చేసుకున్నారు దేవరాజ్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, మురళీమోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి తారలు నటించిన చిత్రాల కోసం ఆయన పనిచేశారు. సుమారు 300లకు పైగా చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన ఆయన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్‌ను తన నివాసానికి ఆహ్వానించారు. ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అంతేకాకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.