Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్... సెక్రటేరియట్ ను అబేద్కర్ పుట్టినరోజు ఏప్రిల్ 14న ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతివాదులుగా ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.