Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. రూ. 99తో ప్లాన్ను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు 200ఎంబీ డేటాతోపాటు రూ. 99 టాక్టైమ్ వస్తుందని సంస్థ పేర్కొంది. ఈ ప్లాన్ 28 రోజులపాటు కాలపరిమితి ఉంటుంది.
చౌకైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అయితే ఈ ఆఫర్ అపరిమిత ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవకాశం లేదేని తెలిపింది. ఎస్ఎంఎస్లు కూకా ఉచితం కాదని స్పష్టం చేసింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. లోకల్, ఎస్టీడీ ఫోన్ కాల్స్ సెకనుకు 2.5పై ఛార్జీ పడుతుందని, ప్రామాణిక ఛార్జీలు వర్తిస్తాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. మరో ప్లాన్ 98తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 14 రోజుల కాలపరిమితితో అపరిమిత ఫోన్ కాల్స్, 200ఎంబీ డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.