Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ధరలు గురువారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా రూ.770 మేర పెరిగి రూ.58,680కి చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.57,910గా ఉంది. ఢిల్లీలో సిల్వర్ ధర కిలోకు రూ.1491 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.71,666కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడం వల్లే దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలు వచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1956 డాలర్లు, వెండి 24.15 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.