Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక మహిళ మైనర్ బాలుడిని లైంగికంగా వేధిస్తున్నది. అతడితో లైంగిక చర్యలకు పాల్పడుతున్నది. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం ఉన్నది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది. మరోవైపు కుమారుడిలో మార్పు, ప్రవర్తనను అతడి తల్లిదండ్రులు గమనించారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని స్కూల్ టీచర్‌ను కోరారు. ఆ టీచర్ అడగడంతో ఆ బాలుడు అసలు విషయం చెప్పాడు. బంధువైన మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ మహిళను హెచ్చరించారు. తమ కుమారుడికి దూరంగా ఉండాలని చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ బాలుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నది. తన ఇంటికి అతడ్ని పిలిపిస్తున్నది. దీంతో బాలుడి పేరెంట్స్ చివరకు పోలీసులను సోమవారం ఆశ్రయించారు. దీని గురించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను నాసిక్‌లో అరెస్ట్ చేశారు.