Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని బర్దీపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భారీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు లేచాయి. ఈ ఘటనలో రూ.37 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు చెప్పారు. ఘటన స్థలాన్ని విద్యుత్తు, ఇరిగేషన్ అధికారులు, రైతులు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ఎత్తిపోతల వద్ద భారీ ట్రాన్స్ఫార్మర్న మంజూరు చేయించుకున్నామని తెలిపారు.
గత ఏడాది మార్చిలో ఈ ట్రాన్స్ఫార్మర్ బిగించినట్లు రైతులు వివరించారు. 2 నెలల పాటు ట్రాన్స్ఫార్మర్ మంచిగా పనిచేసిందని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడతో ఆయకట్టు రైతులందరికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతయని వారు పేర్కొన్నారు. ట్రాన్సఫార్మర్ నుంచి మంటలు ఏలా వచ్చాయనేది ఇంకా స్పష్టత కావడంలేదని, రైతుల నిర్వహణలోనే ఈ ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ కొనసాగుతుందని వారన్నారు. విషయం తేలు సుకున్న విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్, డీఈ/డిచ్పల్లి ఉత్తమ్, డిఈఈ, ఎంఆర్ టి రాజేశ్వర్,ఎడిఈ
రూరల్ బాలేష్, ఏఈ బర్ది పుర్ రాజేందర్ తదితరులు సందర్శించి కోన్ని వివరాలను రైతులకు అడిగి తెలుసుకున్నారు.