Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ నేతలైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సొంతగడ్డలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర శాసన మండలి స్థానానికి జరిగిన ఎన్నికలో మహా వికాస్ అఘాది(ఎంవీఏ) కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అయిన ఎంవీఏ అభ్యర్థి సుధాకర్ అడ్బాలే, నాగ్పూర్ ఉపాధ్యాయ స్థానంలో గెలిచారు. బీజేపీ, సీఎం షిండే వర్గం శివసేన మద్దతిచ్చిన నాగో గనార్ను ఆయన ఓడించారు. బీజేపీ మాతృసంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. కాగా, ముగ్గురు ఉపాధ్యాయ, ఇద్దరు పట్టభద్రుల నియోజక వర్గాల కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 7న ముగియనున్నది. దీంతో ఈ స్థానాల భర్తీకి సోమవారం పోలింగ్ జరిగింది. కొంకణ్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో అత్యధికంగా 91.02 శాతం, ఔరంగాబాద్, నాగ్పూర్, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో 86 శాతం, 86.23 శాతం ఓటింగ్ నమోదైంది. నాసిక్ డివిజన్ గ్రాడ్యుయేట్ సీటులో అత్యల్పంగా 49.28 శాతం పోలింగ్ నమోదైంది.