Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినిమా సెట్స్‌లో పేలుడు సంభవించడంతో ప్రముఖ బంగ్లా నటి షర్మీన్ అఖీ తీవ్రంగా గాయపడింది. మీర్పూర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మేకప్ రూంలో పేలుడు సంభవించింది. దీంతో ఆమె కాళ్లు, చేతులు, వెంట్రుకలు సహా ఒళ్లంతా కాలిపోయింది. దీంతో ఆమెను షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం షర్మీన్ అఖీ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. షూటింగ్ సమయంలో గాయపడ్డ షర్మీన్ అఖీ కోలుకుంటున్నట్టుగా ముందు వార్తలు వచ్చాయి. కానీ రక్తంలోని ప్లాస్మా కౌంట్ దారుణంగా పడిపోవడంతో పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. ఆమె శరీరం కూడా 35 శాతం కాలిపోయింది. దీంతో ఆమె చికిత్సకు కూడా స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం షర్మీన్ను హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయూ)కి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. షర్మీన్ విషయానికొస్తే సిన్సియర్లీ యువర్స్, ఢాకా, బాయిసే స్రాజన్ అండ్ బాందిని వంటి పలు సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.