Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల సమావేశం మధ్యాహ్నం 12.10 గంటలకు మొదలవుతుంది. గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే ఉభయ సభలు వాయిదా పడతాయి. సాయంత్రం ఆయా రాజకీయ పార్టీల శాసనసభా పక్ష నేతలతో శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలను ఖరారు చేస్తారు. ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలను 14వ తేదీ వరకు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. సభ పూర్వపు సంప్రదాయాల ప్రకారం... గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. 4న ఈ తీర్మానం ప్రవేశపెట్టి సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానానికి వివరణ ఇవ్వడంతో ముగించేస్తారు. 5న ఆదివారం సమావేశాలకు సెలవు ఉంటుంది. 6న రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.