Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది అత్యంత విషాదకరమైన రోజని, ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవన్నారు. సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరని చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు విశ్వనాథ్ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈమేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే.విశనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. పండితులని పామరులని కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బంధవుడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పనిచేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివి. 43 ఏండ్ల క్రితం ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయ చిత్రాలు, చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేనిలోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు.