Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరిక
అయోవా రాష్ట్రంలో 66 ఏళ్ల మహిళను గ్లెన్ ఓక్స్ అల్జీమర్స్ స్పెషల్ కేర్లో చనిపోయినట్లు ధృవీకరించింది. దీంతో ఆమెను మృతదేహాలు ఉంచే బ్యాగ్లో ప్యాక్ చేసి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది సదరు వృద్ధ మహిళ. దీంతో కంగారు పడిన కార్మికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ కేర్ హోమ్ సెంటర్కు దాదాపు రూ. 8 లక్షలు జరిమానా విధించారు అధికారులు.
అయితే చనిపోయిందని ప్రకటించడానికి చేయాల్సిన తగిన సంరక్షణ సేవలను అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఆమె డిసెంబర్ 28 నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐతే ఆమె శ్మాశన వాటికి నుంచి తీసుకువచ్చిన రెండు రోజుల అనంతరం జనవరి 5న ఆమె చికిత్స పొందుతూ మరణించింది.