Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీ20 ప్రపంచకప్-2007 హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపాడు. ఈ విషయాన్ని జోగిందర్ తన ట్విట్టర్లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు. జోగిందర్ రిటైర్మెంట్తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు.
“ఇంటర్నేషనల్ సహా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్ జర్నీలో ఎన్నో ఏళ్లు అద్బుతంగా గడిచాయి. టీమిండియాకు ఆడటం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. అలాగే ఐసీసీ తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఆరోజు ధోనీ నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం, ఒత్తిడిలో బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించడం ఎప్పటికి మరిచిపోను. ఇక దేశవాలీ క్రికెట్లో నాకు సహకరించిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రిటైర్మెంట్ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్లోనే కొనసాగాలనుకుంటున్నా. భిన్నమైన వాతావరణంలో నన్ను నేను సవాలు చేసుకుంటూ ముందుకు కొనసాగుతా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో ఇది తదుపరి దశ అనుకుంటున్నా నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా” అంటూ జోగిందర్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు.