Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీనగర్
ఉత్తరాఖండ్లో కుంగుతున్న జోషిమఠ్ వంటి పరిస్థితులు తాజాగా జమ్ముకశ్మీర్లో నెలకొన్నాయి. దోడా జిల్లాలో థాత్రి పట్టణంలోని బస్తీ ప్రాంతంలో ఏడు ఇళ్ల గోడలు, ఫోర్ల్ పగుళ్లిచ్చాయి. దీంతో నివాసితులు భయాందోళనతో ఆ ఇళ్లను ఖాళీ చేశారు. కొందరు పొరుగిళ్లల్లోకి, మరికొందరు బంధువుల ఇళ్లలోకి మారారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుకుంటున్నారు.