Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఓ భర్త తన భార్యను నరికి చంపాడు. డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న యూసుఫ్‌కు, కరీనా బేగంతో ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే గతేడాది నుంచి యూసుఫ్, కరీనా మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
అయితే కరీనా బేగం ఓ ప్రయివేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. తనను దూరం పెట్టిందన్న కోపంతో భార్యను మట్టుబెట్టాలని భర్త నిర్ణయించుకున్నాడు. కరీనా స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఆమెను అనుసరించి ఇనుప రాడ్‌తో తలపై బాదాడు. దీంతో ఆమె నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు యూసుఫ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.