Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టెస్టుల్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ‘గేమ్ ప్లాన్’ షోలో మాట్లాడుతూ 2020 నుంచి ఇప్పటి వరకూ టెస్టుల్లో కోహ్లీ సాధించిన పరుగులు చూస్తే ఆందోళన కలుగుతోందని, ‘ప్రపంచంలోనే మేటి క్రికెటర్, మూడు ఫార్మాట్లలో దాదాపు 25 వేల పరుగులు చేసిన కోహ్లీ లాంటి ఆటగాడు తక్కువ స్కోర్ చేయడం బాధాకరం’ అని ఇర్ఫాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అంతేకాదు ‘కోహ్లీ ఈమధ్య స్పిన్నర్ల బౌలింగ్లో ఆడడంలో తడబడుతున్నాడు. స్పిన్ విషయంలో అతని స్ట్రయిక్ రేటు చాలా తక్కువ ఉంది. త్వరలోనే ఆస్ట్రేలియా సిరీస్లో నాథన్ లియాన్, అగర్ లాంటి టాప్ స్పిన్నర్లను అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా సలహా ఏంటంటే వీరిద్దరి బౌలింగ్లో కోహ్లీ దూకుడుగా ఆడాలి’ అని ఇర్ఫాన్ అన్నాడు.