Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-న్యూఢిల్లీ
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. ఈ తరుణంలో ఆ డ్రోన్ ద్వారా పంపిన మాదక ద్రవ్యాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అమృత్సర్ జిల్లాలోని కక్కర్ గ్రామ సమీపంలో డ్రోన్ సంచరిస్తున్న శబ్దం వినిపించింది. దీంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఆ డ్రోన్‌ను బలగాలు కూల్చేశాయి. డ్రోన్‌తో పాటు 5 కిలోల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.